అనిల్‌ ‘సీన్స్’కి కడుపుబ్బా నవ్వుతున్నా – మెగాస్టార్

అనిల్‌ ‘సీన్స్’కి కడుపుబ్బా నవ్వుతున్నా – మెగాస్టార్

Published on Feb 10, 2025 7:03 AM IST

విశ్వక్ సేన్ ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి తన కొత్త సినిమా గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నట్లు చిరు క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం వేసవిలో ప్రారంభమవుతుందని చిరు తెలిపారు. ఈ సినిమా గురించి మెగాస్టార్ ఇంకా మాట్లాడుతూ.. ‘పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఆ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని చిరు చెప్పారు.

ఐతే, అనిల్ రావిపూడి చెప్పే సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. ‘సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్‌ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్‌ ఉందో.. ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉంది. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు