లక్ష్మీ మంచు టీంతో కలిసిన ఆండ్రియా జెరేమియా

లక్ష్మీ మంచు టీంతో కలిసిన ఆండ్రియా జెరేమియా

Published on Aug 7, 2012 4:38 PM IST


అందాల నటి మరియు గాయని అయిన ఆండ్రియా జెరేమియా లక్ష్మీ మంచు నిర్మిస్తున్న ‘గుండెల్లో గోదారి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా ఒక పాడుతున్నారు కానీ ఆమె ఈ చిత్రంలో నటించడంలేదు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు మరియు ఈ ఆల్బంలో ఆండ్రియా పాడిన పాట హైలైట్ అవుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్ర లాంచ్ త్వరలోనే జరగనుంది మరియు ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆది, లక్ష్మీ మంచు, సందీప్ కిషన్ మరియు తాప్సీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ కి బాగా ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రానికి కుమార్ నాగేందర్ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు