సెన్సార్ ముగించుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. బ్లాక్‌బస్టరే బాకీ..!

AK 2

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసి గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దర్శకుడు మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలుగా (యాడ్స్, టైటిల్స్ కలుపుకుని) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version