క్రియేటివ్ డైరెక్టర్ ‘కృష్ణ వంశీ’ ‘నటసామ్రాట్’ అనే మరాఠీ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందని అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్య సేవ చేస్తూ జీవితాంతం అవివాహిత గానే ఉండే స్త్రీ పాత్రలో అనసూయ నటిస్తోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా అనసూయ పాత్ర దేవదాసి పాత్రే అని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక సీరియస్ రోల్ లో నటిస్తున్నారు. ఆయన పాత్ర పూర్తిగా బలమైన భావోద్వేగాలతోనే సాగుతుందని… ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే సెంటిమెంట్ సీన్స్ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయట.
కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ చేస్తుండగా.. ఇక ప్రకాష్ రాజ్ సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన సతీమణిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాని అభిషేక్ అండ్ మధు నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా మళ్ళీ కృష్ణవంశీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.