క్వారంటైన్ కుకింగ్ అంటూ అనసూయ..!

క్వారంటైన్ కుకింగ్ అంటూ అనసూయ..!

Published on May 12, 2020 5:50 PM IST

తెలుగు బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ కేవలం స్మాల్ స్క్రీన్ పైన మాత్రమే కాకుండా వెండితెర మీద కూడా తానేంటో నిరూపించుకున్నారు. ఎప్పుడూ ఆహ్లాదంగా నవ్వుతూ ఉండే రంగమ్మత్త ఈ క్వారంటైన్ లో తన ఫాలోవర్స్ డిమాండ్ మేరకు తన ఇంట్లోనే ఒక రెసఫీ ను చేసినట్టుగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ స్నీక్ పీక్ వీడియోను వదిలారు.

హాయ్ చెప్తూ అందరి డిమాండ్ మేరకు ఓవర్ నైట్ ఓట్స్ రెసిపీ చేస్తున్నానని దానికి తాలూకా చిన్నపాటి వీడియోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఫుల్ వీడియో తన యూట్యూబ్ ఛానెల్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు రాబోతుంది అని రెడీగా ఉండమంటూ అలెర్ట్ చేసారు. ఈ రెసఫీ పై కాస్త డౌట్ గానే ఉందట..మరి తాను రెడీ చేసిన వంటకం ఎలా ఉందో తెలియాలి అంటే ఆ వీడియో చూడాల్సిందే.

https://www.instagram.com/p/CAFgU_wlYM6/?igshid=1iscsz7lquu3w

సంబంధిత సమాచారం

తాజా వార్తలు