ఆ హనుమానే మా ఇంటికి వచ్చారు – అనసూయ

బుల్లితెర నుంచి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి మంచి డిమాండ్ సంపాదించింది అనసూయ భరధ్వాజ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపొయింది. తాజాగా అనసూయ తన కొత్త ఇంటిలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆ ఇంట్లో పూజలు చేశారు. ఈ క్రమంలో హనుమాన్ తన ఇంటి పూజ కార్యక్రమంలో పాల్గొన్నాడు అంటూ అనసూయ ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ, అనసూయ ఆ పోస్ట్ లో ఏం రాసుకొచ్చారు అంటే.. ‘నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయననే ఆరాధిస్తాను. మా నాన్న ఎప్పుడూ ఓ విషయం చెప్పేవారు. కష్టాల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా సరే హనుమాన్ అని అనుకోకుండా ఏదీ చేయద్దు అని చెప్పారు’ అంటూ అనసూయ తెలిపింది.

అనసూయ తన పోస్ట్ లో ఇంకా రాస్తూ.. ‘ఈ క్రమంలోనే నేను నా కొత్త ఇంటికి సంజీవని అని పేరు పెడదాం అనుకున్నా. హనుమాన్ ను ఆహ్వానించినట్టు ఉంటుదని. కానీ, గురువు గారు చెప్పడంతో రామ సంజీవని అని పేరు పెట్టుకున్నాను. ఎందుకంటే రాముడి లేని చోటు హనుమాన్ ఉండడు. ఆ పేరు పెట్టుకున్నందుకు స్వయంగా ఆ హనుమంతుడే మా ఇంటికి వచ్చాడని గురువు గారు ఫొటో చూపించడంతో ఆనందం తట్టుకోలేకపోయా. ఆ హనుమాన్ ను మా ఇంటికి ఆహ్వానించినట్టు అనిపించింది’ అంటూ అనసూయ రాసుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే అనసూయకు చాలా ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది.

Exit mobile version