బర్త్‌డే నాడు ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న అనసూయ..!

అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. బుల్లి తెర యాంకర్‌గా చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో కూడా నటించింది. అయితే పెళ్ళై, ఇద్దరు పిల్లలున్నా యాంకరింగ్‌లో అనసూయ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ‘

అయితే రేపు అనసూయ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్‌కి ఓ సర్‌ప్రైజ్ ఇవ్వబోతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఇన్‌స్టాలో అనసూయ లైవ్‌లోకి వస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు తనతో కొన్ని సర్‌ప్రైజెస్ కూడా ఉన్నాయని అవి కూడ షేర్ చేసుకుంటానని, ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగాలనిపిస్తే అడగొచ్చని అందులో కొన్నిటికి సమాధానాలు చెబుతానని తెలిపింది.

Exit mobile version