‘ఆనందం’ సినిమాతో విజయాన్నిఅందుకున్న ఆకాష్ ఇటీవలే జై ఆకాష్ గా పేరు మార్చుకున్నాడు. ఆ సినిమా తరువాత నుండి హిట్ కోసం చాలా విధాలుగా తపనపడుతూనే వున్నాడు.
ప్రస్తుతం ఆకాష్ ‘నాతో నేను’ అనే సినిమాతో మనముందుకు రానున్నాడు, విశేషం ఏమిటంటే ఈ సినిమాను ఒక్క పాత్రతో ఒకే లొకేషన్ లో చిత్రీకరించారు. ఈ చిత్రం మొదటి లుక్ ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హింది మరియు ఇంగ్లిష్ భాషలలొ తీస్తున్నారు
రాహుల్ సింగ్ దర్శకుడు. అనూప్ మాథ్యూస్ సంగీత దర్శకుడు. నేహా త్యాగి నిర్మాత