దక్షిణాదిన నాలుగు భాషలలొనూ హిట్లను సాధించి తనకంటూ ఒక పంధాను సృస్థించుకున్న నటి నయనతార. ఆమె తెలుగులో చివరిగా ‘గ్రీకువీరుడు’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘అనామిక’ అనే సినిమాను ముగించేపనిలో వుంది.
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కహానీ’ సినిమాకు రీమేక్ అయిన ఈ ‘అనామిక’ చిత్రంలో నయనతార ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాలో తన పాత్ర గురించి నయన్ మాట్లాడుతూ “అనామిక నా కెరీర్ లోనే నాకు గుర్తుండిపోయే పాత్ర. నటనకు చాలా ఆస్కారం వున్న చాలెంజింగ్ పాత్ర. నేను ఇంకా హింది వర్షన్ నూ చూడలేదు. అక్కడ విద్యాబాలన్ నటించిన నటన నా పాత్రపై ప్రభావం చూపడం నాకు ఇష్టంలేదు. అందుకే షూటింగ్ పూర్తయ్యేవరకూ చూడను” అని తెలిపింది.
నలుగురిలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ఈ భామకు ఇష్టమట. ఆ తపనే ఈ రంగంలోకి తనను లాగిందని చెప్పుకొచ్చింది