ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం షూట్ లో “రాధే శ్యామ్”.!

ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం షూట్ లో “రాధే శ్యామ్”.!

Published on Nov 21, 2020 12:22 AM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ప్రపంచంలోని కొన్ని మరపురాని ప్రేమకథల జాబితాలో ఉంచాలనే మేకర్స్ డిసైడ్ అయ్యారు. అలాగే ప్రతీ సన్నివేశం విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకొని చేస్తున్నారు.

అయితే ఇపుడు హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న చిత్ర యూనిట్ ఒక కీలక సన్నివేశం చేస్తున్నారట. ఇటలీ సెట్ లోనే ఓ వర్షంలో ప్రభాస్ తో ఒక ఆసక్తికర ఎమోషనల్ సన్నివేశం అన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అది కూడా ఈ సినిమాను వర్చువల్ ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తారని అప్పుడు తెలిపారు. ఇపుడు టెక్నాలజీలో ఈ సన్నివేశాన్ని మేకర్స్ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సీన్ సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు