‘హరిహర వీరమల్లు’ పార్ట్ 2 కి ఎగ్జైటింగ్ లీడ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. ఇప్పుడిప్పుడే మరింత హైప్ ని సెట్ చేసుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ దగ్గరకి వస్తుండగా మేకర్స్ ఈ సినిమాని రెండు భాగాలుగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 1 ని బట్టే ఇపుడు పార్ట్ 2 లు వస్తున్నాయి.

అందుకు తగ్గట్టుగానే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ఉండబోతుందట. మెయిన్ గా సినిమాలో పార్ట్ 2 కి ఇచ్చే లీడ్ అభిమానులని మూవీ లవర్స్ కి బాగా ఎగ్జైట్ చేస్తుంది అని తెలుస్తుంది. దీనితో వీరమల్లు పార్ట్ 2 పై మంచి ఆసక్తి ఇపుడు రేగింది. ఇక ఈ భారీ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు. అలాగే ఈ జూన్ 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version