సెప్టెంబర్ 21 రానున్న “అంబులి – 3డి”

సెప్టెంబర్ 21 రానున్న “అంబులి – 3డి”

Published on Sep 12, 2012 5:21 PM IST


తమిళంలో సంచలన విజయం సాదించిన “అంబులి – 3డి” చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో అనువదిస్తున్నారు. పార్తిబన్,శ్రీజిత్, సనం లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హరి శంకర్ మరియు హరీష్ నారాయణలు దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని కే టి వి ఆర్ క్రియేటివ్ రీల్స్ బ్యానర్ మీద లోకనాథ రెడ్డి, శ్రీనివాస్ లోకనాథ రెడ్డి తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ మాములుగా మనకి 3డి చిత్రాలు తక్కువగా వస్తుంటాయి ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో ఈ చిత్రం ఎంతో ఉన్నతమయినది ఇందులో ప్రతి సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు ఒక గ్రామంలో జరిగే ఆసక్తికరమయిన సంఘటనలను చూపించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం. ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం” అని అన్నారు. హరి శంకర్ మరియు హరీష్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి వెంకట్‌ప్రభుశంకర్, సీఎస్ శామ్, సతీష్, మెర్విన్ సాల్మన్ సంగీతం అందించారు. జి.సతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది.

తాజా వార్తలు