క్లాస్ వర్గాన్ని ఆకట్టుకుంటున్న అంతకుముందు ఆ తరువాత

AMAT_Response
‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా విడుదలైన నాటినుండి నేటి వరకూ మంచి సమీక్షలతో మొదటిరోజునుండి శరవేగంగా విజయపుబాటలో పయనిస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్ లకు వెళ్ళే వర్గం ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన సుమంత్ అశ్విన్ తన నటనకు మంచి మార్కులను సంపాదించుకుని కెరీర్ ను బ్రహ్మాండంగా రూపుదిద్దుకునే అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

గత సినిమాకు ఈ సినిమాకు మధ్య సుధీర్ఘ విరామాన్ని తీసుకున్న దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఆ సమయాన్ని వృధా చేయలేదని తెలిసేలాచేశాడు.
ఈ సినిమాని శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కల్యాణి కోడూరి సంగీతాన్ని అందించారు

Exit mobile version