చిన్న చిన్నవైతే ఓకే, పెద్దవైతే నై నై అంటున్న అందాల భామ


స్వతహాగా మలయాళీ భామ అయిన అమలా పాల్ తమిళంలో నటించిన ‘మైనా’ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషల్లో వరుస చిత్రాలు అందిపుచ్చుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మీరు ఒప్పుకున్న పాత్రకి సినిమా ప్రారంభమైన తర్వాత మార్పులు చేస్తే ఆ దర్శకుడి పై మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అని అడిగిన ప్రశ్నకు అమలా పాల్ సమాధానమిస్తూ ‘ నేను ఒప్పుకున్న సినిమాలో నా పాత్రకి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తే ఓకే వాటిని పెద్దగా పట్టించుకోను కానీ అదే పెద్ద పెద్ద మార్పులైతే ససేమిరా ఒప్పుకోను. కానీ దర్శకుడు తను కథ రాసుకునేటప్పుడే ఖచ్చితంగా రాసుకుంటారు, అలాగే ఎవరైతే ఆ పాత్రకి న్యాయం చేస్తారనుకుంటారో అలాంటి వారినే ఆ పాత్రకు ఎంచుకుంటారు. ఎందుకటే దర్శకుడే సినిమాకి కెప్టెన్ అని’ ఆమె అన్నారు. అమలా పాల్ ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘నాయక్’ మరియు నాని సరసన ‘జెండా పై కపిరాజు’ చిత్రాల్లో నటిస్తున్నారు. అది కాకుండా పూరి జగన్నాథ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో త్వరలో ప్రారంభం కానున్న ‘ఇద్దరు అమ్మాయిలతో’ చిత్రంలో కూడా నటించనున్నారు.

Exit mobile version