హర్రర్ స్టొరీపై ఆసక్తి చూపుతున్న అమలా పాల్

amala_paul
ఒకవైపు హాఫ్ బీట్ సినిమాలు, మరో వైపు గ్లామర్ పాత్రల్లో కనిపిస్తున్న అమలా పాల్ సౌత్ ఇండియాలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తాజాగా ఈ అమ్మడు హార్రర్ సినిమా స్టొరీపైన ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకూ డైరెక్టర్, నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ కొనసాగిస్తున్న సముద్ర ఖని(శంభో శివ శంభో ఫేం) త్వరలో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఓ హర్రర్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కథ విన్న అమలా పాల్ ఈ సినిమా పై ఆసక్తి చూపుతోందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రస్తుతం అమలా పాల్ సముద్ర ఖని దర్శకత్వంలో నటించిన ‘జెండాపై కపిరాజు’ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాని హీరోగా నటించాడు. జయం రవి నటించిన ఈ చిత్ర తమిళ్ వెర్షన్ కూడా అదే రోజు విడుదల కానుంది.

Exit mobile version