తమిళ దర్శకుడిని ప్రశంసలలో ముంచెత్తుతున్న అమలా పాల్

తమిళ దర్శకుడిని ప్రశంసలలో ముంచెత్తుతున్న అమలా పాల్

Published on Nov 23, 2012 3:50 AM IST


దక్షిణ భారత దేశంలో అతి తక్కువ కాలంలో మరియు చిన్న వయసులోనే చెప్పుకోదగ్గ పేరు సంపాదించుకున్న నాయిక అమలా పాల్ ఈ మధ్యనే ఈ భామ 21వ వసంతంలోకి ప్రవేశించింది ఇప్పటికే “మైనా”,”రన్ బేబి రన్”,”లవ్ ఫెయిల్యూర్” మరియు “వెట్టై” వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. తెలుగులో తక్కువ కాలంలోనే రామ్ చరణ్ సరసన “నాయక్” మరియు అల్లు అర్జున్ సరసన “ఇద్దరమ్మాయిలతో” వంటి చిత్రాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ సముధ్రఖని దర్శకత్వంలో రానున్న “జెండా పై కపిరాజు” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. తెలుగులో నాని మరియు అమలా పాల్ నటిస్తున్న ఈ చిత్ర తమిళ వెర్షన్లో జయం రవి మరియు అమలా పాల్ నటిస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పని చెయ్యడం చాలా బాగుంది అని, చాలా విషయాలు నేర్చుకుంటున్నాను అని అమలా పాల్ అన్నారు.” ఇది నా 12వ చిత్రం సముధ్రఖని గారి దర్శకత్వంలో చేస్తే ప్రత్యేకంగా నటన లో శిక్షణ తీసుకొను అవసరం లేదు చాలా నేర్చుకోవచ్చు” అని అమలా పాల్ అన్నారు. ఈ చిత్రీకరణ ముగిసాక ఈ భామ తమిళంలో విజయ్ సరసన చిత్రం మరియు “ఇద్దరమ్మాయిలతో” చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటుంది.

తాజా వార్తలు