తమిళంలో అమలపాల్ ఒక పెద్ద చిత్రాన్ని సొంతం చేసుకున్నారు త్వరలో ఆమె విజయ్ సరసన నటించనున్నారు. తమిళంలో ఒకానొక పెద్ద హీరో అయిన విజయ్ సరసన నటించడం ఇదే మొదటిసారి. ఈ చిత్రానికి ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ పాత్ర కోసం యామి గౌతం లేదా సమంతని ఎంచుకున్నారు అని పుకార్లు వచ్చాయి. “రన్ బేబీ రన్” చిత్రంలో అమల నటనకు ముగ్ధుడు అయిన విజయ్ ఈ పాత్రకు అమల పాల్ న్యాయం చెయ్యగలదని ఏ ఎల్ విజయ్ తో కలిసి నిర్ణయించుకున్నారు. చంద్రప్రకాష్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ చిత్రం నవంబర్ 23న ప్రారంభం అవుతుంది. తెలుగులో ఈ నటి మూడు చిత్రాలను చేస్తుంది ఇప్పుడు ఈ చిత్రం జత చేరడంతో ఆమె కెరీర్ మంచి వేగంతో పరిగెడుతుంది. రామ్ చరణ్ “నాయక్” , అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” మరియు నని “జెండా పై కపిరాజు” చిత్రాలలో కనిపించనుంది.