అమలాపాల్ .. ఆ వెబ్ సిరీస్ లో నటిస్తోంది !

అమలాపాల్ .. ఆ వెబ్ సిరీస్ లో నటిస్తోంది !

Published on May 1, 2020 6:55 AM IST

సినిమా అంటే థియేటర్స్ లోనే చూడాలి అనే రోజులు పోయాయి. కరోనా దెబ్బతో.. అలాగే స్మార్ట్‌ఫోన్ల వాడకంతో నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్నారు. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు.

కాగా తాజాగా బ్లాక్ బ్యూటీ అమలాపాల్ కూడా వెబ్ సిరీస్ లో నటిస్తోంది. హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ కథ 1970 నాటిది. మొత్తానికి బాలీవుడ్‌లో నటించాలన్న తన కల తీరుతున్నందుకు అమలాపాల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట. ఇక ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేస్తుండగా.. ఆ మధ్యే సమంత కూడా ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. ఇప్పుడు వీరి బాటలోనే అమలాపాల్ కూడా అడుగులు వేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు