‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!

og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి తన రేంజ్ సినిమా పడి చాలా కాలం అయ్యింది. ఇటీవల వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా చాలా ఆలస్యంగా రావడంతో అనుకున్న అంచనాలు అందుకోలేకపోయింది. ఇక దీని తర్వాత అందరి కళ్ళు ఉన్న సినిమానే “ఓజి”. ఒక్క పవన్ అభిమానులే కాకుండా టాలీవుడ్ ఆడియెన్స్ అంతా గట్టిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మొదటి రోజులు వసూళ్ల కోసం నెల ముందు నుంచే ట్రేడ్ వర్గాల్లో టాక్ స్టార్ట్ అయ్యింది.

ఓజి సినిమా ఓపెనింగ్స్ ఈజీగా 100 కోట్ల మార్క్ నుంచి మొదలవుతుంది అని ట్రేడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. అంతే కాకుండా వీరమల్లుతో మిస్ అయ్యిన 100 కోట్ల షేర్ సినిమా కూడా పవన్ ఓజి తోనే ఖాతా తెరుస్తారని కూడా అంటున్నారు. దీనితో ఓజి సినిమా విషయంలో హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యి పవన్ నుంచి రికార్డు గ్రాసర్ అందిస్తుందో లేదో తెలియాలి అంటే ఈ సెప్టెంబర్ 25 వరకు ఆగాల్సిందే.

Exit mobile version