గుడ్ న్యూస్ చెప్పిన అల్లు శిరీష్..!

గుడ్ న్యూస్ చెప్పిన అల్లు శిరీష్..!

Published on Oct 1, 2025 6:00 PM IST

Allu-Sirish

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం ఇటీవ‌ల ఆయన త‌ల్లి కనకరత్నం(అల్లు అర్జున్, అల్లు శిరీష్‌ల నానమ్మ) మృతితో తీవ్ర విషాదాన్ని అనుభవించింది. ఆ విషాదం నుంచి అభిమానులు ఇంకా కోలుకోకముందే, ఆ ఇంటి నుంచి ఓ శుభవార్త వినిపిస్తోంది.

యాక్టర్ అల్లు శిరీష్ త్వరలోనే తన నిశ్చితార్థాన్ని నయనికతో అధికారికంగా ప్రకటించారు. తమ నిశ్చితార్థం అక్టోబర్ 31న జరగనుందని శిరీష్ తెలిపారు. తన తాతగారు అల్లు రామలింగయ్య జయంతి రోజున ఈ వార్తను పంచుకోవడం సంతోషంగా ఉందని శిరీష్ ప్రకటించాడు. శిరీష్, నయనిక చేతులు పట్టుకున్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోను పారిస్‌లో క్లిక్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ హ్యాపీ న్యూస్‌పై సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు శిరీష్‌ను అభినందిస్తున్నారు. నిశ్చితార్థ మరియు పెళ్లి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు