సోషల్ మీడియా ప్రభావం తరువాత స్టార్స్ కి సంబంధించిన ప్రతి విషయం బయటికి వస్తుంది. ముఖ్యంగా స్టార్స్ తో సమానంగా వారి కిడ్స్ మంచి పాపులారిటీ, గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక అలాంటి స్టార్ కిడ్స్ లో బన్నీ పిల్లలు కూడా ఉన్నారు. ఐతే బన్నీ కుమారుడు అయాన్ బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ అభిమాని అట. టైగర్ ష్రాఫ్ భాగీ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండే అయాన్ టైగర్ ష్రాఫ్ ని ముద్దుగా టైగర్ స్క్వాష్ అని పిలుచుకుంటాడట.
ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీనికి స్పందనగా టైగర్ ష్రాఫ్ తన మూవీ సెట్స్ కి రావలసిందిగా అయాన్ ని ఆహ్వానించాడు. ఆలాగే అయాన్ పెట్టిన ముద్దు పేరుని ఆయన బాగా ఇష్టపడ్డారు. ఇక టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ 3 ఇప్పుడు థియేటర్స్ లో ఉంది. ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించారు.