ఫిబ్రవరి 1 నుండి అల్లు అర్జున్ స్పానిష్ షెడ్యూల్

ఫిబ్రవరి 1 నుండి అల్లు అర్జున్ స్పానిష్ షెడ్యూల్

Published on Jan 21, 2013 8:25 PM IST

allu-arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” చిత్ర మొదటి షెడ్యూల్ ని ముగించుకున్నారు. ఈ చిత్రం బ్యాంకాక్లో చిత్రీకరణ జరుపుకొని ప్రస్తుతం స్పెయిన్ కి బయలుదేరింది. ఈ చిత్ర స్పానిష్ షెడ్యూల్ ఫిబ్రవరి 1న మొదలుకానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

అమలా పాల్ మరియు కేథరిన్ తెరెసా ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిలిం ఉపయోగించకుండా డిజిటల్ లో తెరకెక్కించడం ఆసక్తికరం.

“జులాయి” వంటి విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద భారి అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు