స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేసు గుర్రం’. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ పాటని అల్లు అర్జున్ – కైరతదత్తాలపై చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో వీరిద్దరితో పాటు కమెడియన్స్ అయిన తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డిలు కూడా స్టెప్స్ వేస్తున్నారు. షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ సరసన శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో కిక్ శ్యామ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నల్లమలపు శ్రీనివాస్ – డా. కె వెంకటేశ్వరరావు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదటిసారి బన్ని సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇది కాకుండా అల్లు అర్జున్ అతిధి పాత్ర పోషించిన ‘ఎవడు’ సినిమా నిన్న విడుదలై మాస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.