స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోల్కొండ ఫోర్ట్ లో జరుగుతోంది. ఈ షూటింగ్లో అల్లు అర్జున్ పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. సలోని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమా నిర్వాహకులు ఈ సినిమాని జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫైట్ సన్నివేశాలు, పాటలు ముగిశాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు.