ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే “జులాయి” చిత్ర విజయంతో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ చిత్రంలో అయన నటనకు గాను పలు ప్రశంశలు అందుకున్నారు. ఇప్పటికే పలు అవార్డ్లు అందుకున్న ఈ నటుడు తాజాగా ఫేస్ బుక్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లో సరికొత్త మైలురాయిని చేరుకున్నారు. దాదాపుగా ఐదు లక్షల మంది ఫాలోయర్స్ ఈ నటుడి పేస్ బుక్ ఫ్యాన్ పేజికి ఉన్నారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా కర్ణాటక మరియు కేరళలో కూడా అభిమానులను సంపాదించుకున్న ఈ నటుడు మరే యువ హీరో సాదించలేనిది సాదించాడు. ఇలానే అయన మనల్ని అలరిస్తూ మరింత అభిమానులను సంపాదించుకోవాలని కోరుకుందాం. ఫ్యాన్ పేజి లింక్ మీకోసం https://www.facebook.com/fansofalluarjun