ఆ పేదరైతు సినిమా పిచ్చి మమ్మలి ఈ స్థాయికి తెచ్చింది.

లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య వర్థంతి నాడు మనువడు అల్లు అర్జున్ ఆయన్ని తలచుకుంటూ ఓ ఎమోషన్ మెస్సేజ్ పంచుకున్నారు. సినిమాపట్ల ఆయనకున్న మక్కువే మమ్ముల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది అని తెలియజేశాడు. అల్లు అర్జున్ ట్విట్టర్ లో…”తాత మమ్మల్ని విడిచిపెట్టిన ఈ రోజు నాకు గుర్తుంది. ఆయన గురించి నాకు బాగా తెలుసు. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఓ పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాపై ఉన్న మక్కువ కారణంగానే మేమంతా ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాం” అని పోస్ట్ చేశారు.

కాగా నేడు అల్లు అర్జున్ నుండి ఓ బిగ్ అనౌన్స్మెంట్ రానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ దీనిపై కొద్దిసేపటి క్రితం ఓ హింట్ ఇవ్వడం జరిగిది. నేడు మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఆ అనౌన్స్మెంట్ ఏమిటీ తెలియనుంది. కాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఇది ఆయన నెక్స్ట్ మూవీ గురించిన కీలక అప్డేట్ అంటున్నారు. మరి కాసేపట్లో దీనిపై స్పస్టత రానుంది.

Exit mobile version