బన్ని చేతుల మీదుగా ‘రేయ్ ఎ టు జెడ్ లుక్’

Allu-Arjun
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా వైవిఎస్ చౌదరి డైరెక్ట్ చేసిన ‘రేయ్’ సినిమా ఎ టు జెడ్ లుక్ ని లాంచ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే వైవిఎస్ చౌదరి విడుదల చేసిన 3 ఫీలర్స్ లో సాయి ధరమ్ తేజ్ డాన్స్ మూమెంట్స్ ని మాత్రమే రివీల్ చేసారు. ఈ రోజు పూర్తి లుక్ ని రిలీజ్ చేయనున్నాడు.

సయామీ ఖేర్, శ్రద్ధ దాస్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటించేవారు. ఈ రోజు జరగనున్న ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు ఈ సినిమాలోని హీరో హీరోయిన్స్ కూడా హాజరవుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని కరేబియన్ ఐలాండ్స్ లో షూట్ చేసారు. ముగ్గురు డాన్సర్ గా కనిపించనున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ మేక్సికన్ పాప్ సింగర్ గా కాస్త నెగటివ్ పాత్రలో కనిపించనుంది.

చక్రి మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో జనవరి 17న రిలీజ్ కానుంది. అలాగే సినిమా ఫిబ్రవరి 5న రిలీజ్ కానుంది.

Exit mobile version