ఇద్దరమ్మాయిల కోసం బన్ని అదిరిపోయే స్టంట్స్?

ఇద్దరమ్మాయిల కోసం బన్ని అదిరిపోయే స్టంట్స్?

Published on Jan 6, 2013 9:29 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ ప్రస్తుతం బ్యాంకాక్లో శరవేగంగా జరుగుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో బన్ని సరసన అమలా పాల్ – కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా బాంకాక్లో హీరో ఇంట్రడక్షన్ ఫైట్ కోసం కొంత రిస్క్ తో కూడుకున్న డేర్ డెవిల్ స్టంట్స్ తీస్తున్నారు.

గతంలో బిల్లా 2, విశ్వరూపం సినిమాలకు ఫైట్స్ అందించిన కేచ కంఫాక్ డీ ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ పూర్తి స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

తాజా వార్తలు