పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హైయెస్ట్ గ్రాసర్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు దర్శకుడు అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బన్నీ ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని కొన్ని ముఖ్య పనులు కూడా కంప్లీట్ చేస్తుండడం జరుగుతుంది.
అలా అమెరికాలో గత ఏడేళ్ల నుంచి జరుగుతున్న తెలుగు సంబరాలు (నాట్స్)లో సందడి చేసేందుకు సిద్ధం అయ్యారు.. తానే ముఖ్య అతిధిగా కానున్న ఈ ఈవెంట్ అక్కడి తెలుగు వారు అందరికీ కొత్త ఉత్సాహాన్ని అందించింది. మరి ఈ రానున్న జూలై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరుగుతున్న నాట్స్ వేడుకల్లో ఆయన పాల్గొనటం ఎంతో ఆనందం అంటూ నాట్స్ ప్రతినిధులు తె లియచేశారు.