స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజ్ ఒక అరుదైన ఘనత సాధించడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇటీవలే అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజ్ ఒక మిలియన్ ఫాలోవర్స్ పైన ఫాలో అవుతున్నారు. టాలీవుడ్ హీరోల్లో ఈ అరుదైన ఘనతని దక్కించుకున్న మొట్ట మొదటి హీరో అల్లు అర్జున్.
ఈ సందర్భంగా ఈ రోజు అల్లు అర్జున్ ఓ స్పెషల్ థాంక్స్ వీడియోని రిలీజ్ చేసారు. ఆ వీడియోని తన అఫిషియల్ ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసాడు. అల్లు అర్జున్ అన్ని భాషల్లో ఉన్న తన అభిమానులకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ వీడియోలో కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ఆ పేజ్ మెయిన్ టైన్ చేస్తున్న అడ్మిన్ డిపార్ట్ మెంట్ కి కృతఙ్ఞతలు చెప్పాడు. అలాగే చివర్లో అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్ థాంక్స్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి — వీడియో