ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన మార్కెట్ ని అంచలంచలుగా ఎలా బిల్డ్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. ఇది కేవలం తన మార్కెట్ నే కాకుండా తన బ్రాండ్ ని కూడా సెట్ చేసుకున్నట్టు అయ్యిందని పుష్ప 2 తో రుజువైంది. మరి ఇలా బన్నీ బాయ్ పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని సెట్ చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాపై దర్శకుడు అట్లీతో కలిసి కన్నేశాడు. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ డిమాండ్ కూడా మారిపోయింది.
ఇలా తనకోసం ఎంతైనా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉంటే ఇప్పుడు అట్లీతో భారీ ప్రాజెక్ట్ కి మాత్రం ఇండియాలోనే ఏ ఇతర హీరో తీసుకోని రేంజ్ భారీ పారితోషికాన్ని తాను అందుకుంటున్నట్టు ఇప్పుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంటే తన రెమ్యునరేషన్ ఈజీగా 200 కోట్లకి పైమాటే అని చెప్పవచ్చు. సో ఇలా తాను కట్టుకున్న సామ్రాజ్యంతో మాత్రం బన్నీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ హీరోగా మారాడనే అనుకోవాలి.