‘మీసాల పిల్ల’ ట్రీట్ కి టైం వచ్చేసిందోచ్!

‘మీసాల పిల్ల’ ట్రీట్ కి టైం వచ్చేసిందోచ్!

Published on Oct 12, 2025 7:00 PM IST

meesala-pilla

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” కోసం అందరికీ తెలిసిందే. సాలిడ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే వచ్చిన ఫస్ట్ సింగిల్ తాలూకా ప్రోమో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వైబ్స్ ని అందించింది.

ఇక ఈ సాంగ్ తాలూకా ఫుల్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి డేట్ ని మేకర్స్ ముందు అనౌన్స్ చేస్తే ఇప్పుడు చిరు, నయన్ లపై ఓ బ్యూటిఫుల్ పోస్టర్ తో మీసాల పిల్ల ఫుల్ సాంగ్ రిలీజ్ టైం ని అనౌన్స్ చేసేసారు. దీనితో రేపు అక్టోబర్ 13న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు.

సో రేపటి నుంచి మోత మరింత మోగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సాంగ్ కోసం లెజెండరీ గాయకులు ఉదిత్ నారాయణన్ ని తీసుకోగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కి రాబోతుంది.

తాజా వార్తలు