
ఇప్పటి వరకు 11 సినిమాల్లో హీరోగా నటించిన అల్లు అర్జున్ ప్రతి సినిమాలోనూ ఒక్క హీరోయిన్ తో మాత్రమే రొమాన్స్ చేసాడు. ఫస్ట్ టైం ఇద్దరు హీరోయిన్లతో కలిసి ‘ఇద్దరమ్మాయిలతో’ నటించబోతున్నాడు. ఫస్ట్ టైం ఇద్దరు హీరోయిన్లతో నటిస్తున్నారు కదా ఎలా ఫీలవుతున్నారు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ “ఒకే హీరోయిన్ ఉండాలని రూల్ ఏమీ పెట్టుకోలేదు, ఇప్పటి వరకు నా దగ్గరికి అలాంటి కథలేమి రాలేదు. ఫస్ట్ టైం నన్ను పూరి జగన్నాధ్ ఇద్దరు హీరోయిన్లతో చుపించబోతున్నారు”. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కాబట్టే బన్నీ ఈ సినిమా ఒప్పుకున్నాడు అని పూరి అంటున్నారు అని అడగగా “పూరి సరదాగా ఆ మాట అన్నారు. పూరి నాకు ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేసాను. కేవలం కథ నచ్చి ఒప్పుకున్నాను. నా సినిమాలకు ఆంధ్ర ప్రదేశ్ లాగే మలయాళంలో కూడా బాగా క్రేజ్ ఉంది అందుకే రెండు చోట్ల ఒకేసారి విడుదలయ్యేలా విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వేదంలో మనోజ్ తో కలిసి నటించాను. ప్రస్తుతం ఎవడులో చరణ్ తో కలిసి చేస్తున్నాను. మంచి కథలు వస్తే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నేనెప్పుడు రెడీ” అన్నారు.