స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో నార్వే వెళ్లనున్నాడు. ప్రస్తుతం ఆలు అర్జున్ ‘రేస్ గుర్రం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ పూర్తి గ్లామరస్ అవతారంలో కనిపించనుంది. నల్లమలుపు బుజ్జి – డా. వెంకటేశ్వర రెడ్డిలు నిర్మిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ స్క్రిప్ట్ ను అందిస్తున్నారు. ఈ సినిమా యాక్షన్, కామెడీతో తెరకెక్కుతోందని సమాచారం. అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా త్వరలో విడుదలకానుంది. ‘రేస్ గుర్రం’ సినిమా ఈ సంవత్సరం చివరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.