స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా పై యుద్ధంలో సామాజిక బాధ్యతగా భారీ ఆర్థిక సహాయం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, తనకు అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన కేరళ రాష్ట్రానికి కూడా కలిపి ఆయన 1.25 కోట్ల సాయం ప్రకటించారు. అలాగే శుభ్రంగా ఉండాలని, కరోనా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అందరూ ఇంటికే పరిమితం కావాలని ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలతో పాటు దర్శక నిర్మాతలు ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
బన్నీ ప్రస్తుతం సుకుమార్ చిత్రంలో నటిస్తున్నారు. బన్నీ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది.
https://www.instagram.com/p/B-OfNWXHuRk/?utm_source=ig_web_copy_link