ఫేస్ బుక్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన అల్లు అర్జున్

allu-arjun
తన డాన్సులు, స్టైలిష్ లుక్ తో ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కి మన ఏపి లోనే కాకుండా కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రోజు రోజుకి బన్నికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. దాంతో తాజాగా అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజ్ పేజ్ 3 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో అల్లు అర్జున్ సౌత్ ఇండియాలోనే 3 మిలియన్ ఫాలోవర్స్ ని సాధించిన తొలి హీరోగా రికార్డు సృష్టించాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం రేసు గుర్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శృతి హాసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు.

Exit mobile version