ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్?

ముఖ్యమంత్రిగా అల్లు అర్జున్?

Published on Jul 21, 2020 8:04 PM IST

కొద్దిరోజులుగా టాలీవుడ్ లో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. యాత్ర ఫేమ్ మహి రాఘవతో మూవీకి అల్లు అర్జున్ ఒప్పుకున్నారట. ఆ మూవీ కూడా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ అని ప్రచారం సాగుతుంది. దీనితో అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీలో సీఎం గా కనిపించనున్నాడనే ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ, సీఎం పాత్రలో అల్లు అర్జున్ అంటుంటే ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ వస్తుంది.

ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప మూవీ చేస్తున్న బన్నీ, నెక్స్ట్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే మూవీ చేయాల్సివుంది. ఐకాన్ మూవీ నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ తరువాత బన్నీ చేసే మూవీ మహి రాఘవతోనేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరో ప్రక్క అల్లు అర్జున్, మహి రాఘవ లాంటి వర్ధమాన డైరెక్టర్ కి అవకాశం ఇస్తాడా అనే అనుమానం కూడా కలుగుతుంది.

తాజా వార్తలు