పాన్ ఇండియా కోసం అల్లు అర్జున్ కూడా .. !

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలందరికీ పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఉంది. అందుకే తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే తమ పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో కూడా అందరూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ను పెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే ప్రభాస్ సినిమాలో దీపకాను ఫిక్స్ చేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా పుష్ప కూడా పాన్ ఇండియా సినిమాగా వస్తోంది.

అందుకే ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ చేత కనీసం గెస్ట్ రోల్ అన్నా చేయించాలని బన్నీ టీం సన్నాహాలు చేసుకుంటుంది. మరి ఏ స్టార్ హీరోయిన్ బన్నీతో స్టెప్స్ వేయడానికి ఒప్పుకుంటుందో చూడాలి. స్టార్ హీరోయిన్ ఒప్పుకోకపోతే అప్షన్ గా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండేను తీసుకోవాలనుకుంటున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి బన్నీకి స్టార్ హీరోయిన్ దొరుకుతుందో లేక అనన్యకే ఫిక్స్ అవుతారో చూడాలి.

మొత్తానికి అన్ని ఇండస్ట్రీస్ నుండి స్టార్ లను తీసుకుని ఈ సినిమా రేంజ్ ను పెంచాలకుంటున్నారు. పైగా ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్ నుండి ఈ పుష్ప సినిమా వస్తుండటంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.

Exit mobile version