కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా రానున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ ‘యముడికి మొగుడు’. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియా మొత్తం మీద 27న విడుదలవుతుండగా, యు.ఎస్ లో 28న విడుదలవుతోంది. రిచా పనాయ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఇ. సత్తిబాబు డైరెక్టర్. నరేష్ నటించిన ‘సుడిగాడు’ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ సినిమా భారీగా రిలీజ్ కానుంది.
నరేష్ కెరీర్లో హై బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నరేష్ యముడి కూతుర్ని ప్రేమించే పాత్రలో కనిపించనున్నాడు. సాయాజీ షిండే యమధర్మ రాజుగా కనిపిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటి రమ్యకృష్ణ యముడి భార్యగా కనిపించనుంది. కోటి మ్యూజిక్ అందించిన ఈ సినిమాని చంటి అడ్డాల నిర్మించాడు.