‘నెల తక్కువోడు’గా అల్లరి నరేష్

‘నెల తక్కువోడు’గా అల్లరి నరేష్

Published on Jan 3, 2012 10:05 AM IST


కామెడీ హీరో అల్లరి నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే ముద్ర ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఆయన సినిమాలు ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. తాజాగా ఆయన మరో కామెడీ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి ‘నెల తక్కువోడు’ అనే అనుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సత్తిబాబు డైరెక్ట్ చేయబోతుండగా చంటి అడ్డాల నిర్మాత. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. ప్రస్తుతం అల్లరి నరేష్ నటిస్తున్న చిత్రాలు పూర్తవగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు