ఈ వేసవిని నవ్వులతో కెవ్వు కేక పెట్టిస్తాడట

ఈ వేసవిని నవ్వులతో కెవ్వు కేక పెట్టిస్తాడట

Published on Feb 24, 2013 8:01 PM IST

Allari-Naresh

అల్లరి నరేష్ రాబోయే ‘కెవ్వు కేక’ సినిమా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయ్. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బొప్పన చంద్రశేఖర్ జాహ్నవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. కన్నడ నటి షర్మిలా మాండ్రే ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.

ఇటీవలే అల్లరి నరేష్ – షర్మిల మధ్య నాలుగు రోజుల పాటు పొల్లాచిలో తెరకెక్కించిన ఒక జానపద గీతం సినిమాకే హైలైట్ గా నిలవనుంది. మార్చ్ 3 నుండి 15 వరకూ తరువాత షెడ్యూల్ జరగనుంది. దాంతో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది.

ఈ వేసవిలో అల్లరి నరేష్ నటిస్తున్న ‘యాక్షన్ 3డి’, ‘కెవ్వు కేక’ విడుదలకానున్నాయి. దాని తర్వాత ఇతను కృష్ణ వంశీ తీయబోయే కామెడీ చిత్రంలో నటిస్తాడు. ‘యాక్షన్ 3డి’, ‘కెవ్వు కేక’కి ఉన్న క్రేజ్ ని చూస్తుంటే ఈ ఏడాదికి అల్లరి నరేష్ తన ఫాన్స్ కి కావలసినంత వినోదం పంచనున్నాడని అనిపిస్తుంది.

తాజా వార్తలు