పూర్తికావచ్చిన అల్లరి నరేష్ జంప్ జిలానీ

Allari-Naresh
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం జంప్ జిలానీ షూటింగ్ చివరిదశలో వుంది. ఇ. సత్తిబాబు ఈ సినిమాకు దర్శకుడు. అంబికా కృష్ణ నిర్మాత. తమిళ సినిమాకు రీమేక్ అయిన
ఈ చిత్రంలో కెరీర్ లోనే మొదటిసారిగా అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు

ఈ సినిమా టాకీ భాగం ఇప్పటికే ముగిసింది. ప్రస్తుతం మస్కట్ లో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. రెండు పాటలు మినహా అక్కడ షూటింగ్ ముగించుకుని చిత్రబృందం ఈ పాటల నిమిత్తం
బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఇషా చావ్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గా, అల్లరి నరేష్ హోటల్ ఓనర్ గా కనిపిస్తారు. స్వాతీ దీక్షిత్ ముఖ్యపాత్రధారి

అల్లరి నరేష్ రవి బాబుల లడ్డూ బాబు సినిమా ఈ నేల 18న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాలో పూర్ణ, భూమిక హీరోయిన్స్

Exit mobile version