తెలుగులో తెరకెక్కుతున్న తొలి 3డి సినిమా ‘యాక్షన్ 3డి’, విత్ ఎంటర్టైన్మెంట్ అనేది ఉపశీర్షిక . ఈ సినిమాలో అల్లరి నరేష్ తో పాటు వైభవ్, శ్యాం మరియు రాజు సుందరం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. స్నేహా ఉల్లాల్, కామ్న జఠ్మలాని మరియు నీలం ఉపాధ్యాయ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలేబ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ ‘ ఇప్పటి యువతరం భావాలకు అద్దం పట్టేలా సినిమా ఉంటుంది. మామూలుగా యాక్షన్ సినిమాలను లేదా భారీ బడ్జెట్ థ్రిల్లర్ సినిమాలను మాత్రమే 3డి లో తీస్తారు, కానీ కామెడీ మూవీని 3డిలో తీస్తే ఇంకా బాగా ఎంజాయ్ చెయ్యొచ్చని 3డి లో తీస్తున్నాము. ఈ సినిమాని ఒకేసారి తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నామని’ అన్నారు. ఈ సినిమాకి బప్పి లహరి మరియు ఆయన తనయుడు బప్ప లహరి కలిసి సంగీతం అందిస్తున్నారు.