నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటున్న అల్లరోడు

నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటున్న అల్లరోడు

Published on Nov 13, 2012 10:13 PM IST


కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా, షర్మిలా మాండ్రే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘కెవ్వు కేక’. గతంలో నరేష్ తో ‘బ్లేడ్ బాబ్జీ’ సినిమా తీసిన దేవీ ప్రసాద్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో తమ హీరో పాత్ర గురించి డైరెక్టర్ మాట్లాడుతూ ‘ అందరిలా కాకుండా తను ఏది చేసినా అదిరిపోవాలి అనుకుంటుంటాడు. ఇదంతా అతని గురించి గొప్పగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో చేస్తుంటాడు. అలాచేసే ప్రతి పనిలోనూ చాలా కామెడీ ఉంటుందని, అది చూసిన వారు చాలా బాగా నవ్వుకుంటారు. యీ చిత్రంలోని డైలాగ్స్ చాలా అందరికీ నచ్చుతాయని’ అంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలో హాస్పిటల్ నేపధ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు