ట్రైలర్ టాక్ : ‘12ఏ రైల్వే కాలనీ’తో అల్లరి నరేష్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

హీరో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’ ఇప్పటికే వైవిధ్యమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘పొలిమేర’, ‘పొలిమేర-2’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన డా.అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని నాని కసరగడ్డ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ అంశాలతో కట్ చేశారు మేకర్స్. ఓ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్‌ను ఈ సినిమా కథగా మనకు చూపించబోతున్నారు. ఇక ఇందులోని సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ మరోసారి సీరియస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, తదితరులు తమ పర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తు్న్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version