ఖరారు అయిన ‘అల్లరి’ నరేష్ ఇంద్ర గంటిల చిత్రం పేరు

Allari-Naresh
ఈ ఏడాది అంతా ‘అల్లరి’ నరేష్ చాలా బిజీ గా వుండనున్నాడు. అతని తాజా చిత్రం ‘జంప్ జిలాని’ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అంతే కాకుండా ఇంకో మూడు చిత్రాల షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానున్నాయి.
‘అల్లరి’ నరేష్ త్వరలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో నటించనున్నాడు. ఆ చిత్రానికి ‘బంది పోటు’ అనే పేరు ని ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని ఇ. ఇ . వి సినిమా బ్యానర్ పై రాజేష్ నిర్మించనున్నాడు. ‘అష్టా చమ్మా’ ‘గోల్కొండ హై స్కూల్’ ‘అంతకు ముందు ఆ తర్వాత’ లాంటి చిత్రాలకి దర్శకత్వం వహించిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ తో కలసి పని చేస్తున్నందుకు ‘అల్లరి’ నరేష్ చాలా ఆనందం గా వున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి వున్నాయి.

ఇదిలా వుండగా పూర్ణ భూమిక నటించిన రవి బాబు దర్శకత్వం వహించిన ‘లడ్డు బాబు’ ఏప్రిల్ 18 న విడుదల కానుంది.

Exit mobile version