రాఘవేంద్ర రావు స్టైల్ పాటలో అల్లరి నరేష్

రాఘవేంద్ర రావు స్టైల్ పాటలో అల్లరి నరేష్

Published on Dec 7, 2012 8:26 AM IST


దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి పాటల చిత్రీకరణ విషయంలో ఒక ప్రత్యేక శైలి ఉంది. ఆయన పాటల్లో పూలు, అన్ని రకాల పండ్లు, రంగుల ప్రపంచం లాగా తన పాటలకంటూ ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. ఈ రకమైన పాటల చిత్రీకరణని చాలా మంది దర్శకులు ఫాలో అయ్యారు కూడా. ప్రస్తుతం కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఒక సినిమాలో ఇలాంటి పాటనే వాడారు. నరేష్ నటిస్తున్న యాక్షన్ 3డి సినిమాలో రాఘవేంద్ర రావు స్టైల్ పాటని చిత్రీకరించారు. అనిల్ సుంకర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ అని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అల్లరి నరేష్, వైభవ్, శ్యాం, రాజు సుందరం, స్నేహా ఉల్లాల్, కామ్న జెఠ్మలాని, నీలమ్ ఉపాధ్యాయ తారాగణంగా తెరకెక్కుతున్న యాక్షన్ సినిమాకి బప్పి లహరి, బప్ప లహరి కలిసి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు