యముడికి మొగుడు మీద గట్టి నమ్మకంతో ఉన్న నరేష్

yamudiki-mogudu-poster
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘సుడిగాడు’ సినిమా తరువాత అతని రేంజ్ పూర్తిగా మారిపోయింది. సుడిగాడు ముందు వరకు మినిమమ్ గ్యారంటీ హీరోగా పేరున్న నరేష్ ఆ సినిమా తరువాత సినిమా ఎంపికల విషయంలో, సినిమాల విడుదల విషయంలో, ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అతను తాజాగా నటించిన సినిమా ‘యముడికి మొగుడు’ ఈ వారం విడుదల కాబోతుంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమాకి నరేష్ తన మార్కు స్టైల్ ఎంటర్టైన్మెంట్ జోడించాడు. కొందరు అగ్ర హీరోలు యముడి మీద సినిమాలు చేసి హిట్స్/ఫ్లాప్స్ మూటగట్టుకున్నారు. నరేష్ కి యముడి కాన్సెప్ట్ కలిసి వస్తుందో లేదో చూడాలి మరి. యముడిగా షాయాజీ షిండే నటించగా ఈ. సత్తి బాబు ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. కోటి సంగీతం అందించిన ఈ సినిమాని చంటి అడ్డాల నిర్మించాడు.

Exit mobile version