ఆ క్రెడిట్ దర్శకులదే అంటున్న కాజల్

ఆ క్రెడిట్ దర్శకులదే అంటున్న కాజల్

Published on Nov 1, 2013 8:43 AM IST

kajal

అందాల భామ కాజల్ అగర్వాల్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ సంవత్సరం తెలుగులో రెండు హిట్స్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉంది. అలాగే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి బాగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో కాజల్ కూడా ఒకరు. కానీ కాజల్ మాత్రం నటిగా నన్ను నేను పరిపూర్ణంగా ఆవిష్కరించుకోగలిగాను అంటే ఆ క్రెడిట్ మొత్తం దర్శకులదే అంటోంది .

అలాగే కాజల్ మాట్లాడుతూ ‘నా సక్సెస్ లకి, నా కొచ్చిన పేరుకి ఇక్కడి దర్శకులే కారణం. ఎందుకంటే సౌత్ ఇండియన్ సినిమాల వల్లే బాలీవుడ్ కి వెళ్ళగలిగాను. నా మొదటి సినిమా ‘లక్ష్మీ కళ్యాణం’ నటిగా నాకు ఎంతో భరోసా ఇచ్చింది. కెరీర్ మొదట్లో ‘మగధీర’ లాంటి సినిమా రావడం మరో అదృష్టం. అలాగే సెట్స్ కి వెళ్ళే ముందు చాలా ప్రశాతంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఇంటి విషయాలు సెట్స్ లోకి తీసుకెళ్ళను. ఎందుకంటే సెట్లో నా కోసం వందల మంది కష్టపడుతుంటారు. నేను తప్పు చేస్తే వారి కష్టమంతా వృధా అవుతుంది. ఒకసారి పేకప్ చెబితే మళ్ళీ సినిమా గురించి ఆలోచించను. సినిమా విషయాలు ఇంటి దాకా మోసుకెళ్ళను, రేపటి సీన్స్ గురించి కూడా ఆలోచించనని’ చెప్పింది.

తాజా వార్తలు