మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవదలపతి సుధీర్ బాబు హీరోగా బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా తెలుగు ఎంట్రీ ఇస్తూ చేస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “జటాధర”. దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ లు తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ తో మాత్రం ఈ సినిమాకి ఇదివరకు లేని బజ్ వచ్చింది అని చెప్పవచ్చు.
మెయిన్ గా ఇందులో కంటెంట్ మాట్లాడడంతో ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ దానికోసం సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. దీంతో ట్రైలర్ ముందు వరకు లేని బజ్ ని అంతా ట్రైలర్ వచ్చాక తీసుకొచ్చి మారింది అని చెప్పాలి. మరి ఈ మూమెంటం ని సినిమా రిలీజ్ వరకు మేకర్స్ క్యారీ చేసుకుంటూ వెళ్తారో లేదో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఈ నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కి రాబోతుంది.